సాధన యందు స్థిరత్వం పొందటం ఎలా ?స్వామీ! 'సాధన'యందు స్థిరత్వం పొందుట యట్లు? 
--------------------------------------------------------------


సాధరణంగా పూర్వజన్మ పుణ్య ఫలమున శాస్త్రం చూడగానే, లేదా సత్సంగంలో గురువాక్యం వినంగానే, ఉన్నదైన పరబ్రహ్మ యొక్క స్వరూప స్వభావాలు మనకు ఇట్టే అవగతమౌతాయి.

కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆ పరబ్రహ్మ స్వరూపమును (వస్తునిశ్చయజ్ఞానాన్ని) అనుభవంలోకి తెచ్చుకోవడం లో వస్తుంది అసలు తంటా.
మరి అలాంటప్పుడు తెలిసిన సాధనలే అయినప్పటికి, అందులో స్థిరత్వం వుండదు. కోతి ఒక కొమ్మమీది నుంచి మరొక కొమ్మ మీదికి దూకినట్లు, ఒక సాధన మార్గం నుంచి మరో సాధనలోకి దూకుతుండడం పరిపాటే. అయితే ఇది సరైన విధానం ఎన్నటికీ కాదు.
పది చోట్ల పది గుంటలు త్రవ్వే బదులు, ఒక్క చోటే లోతైన గుంట తవ్వితే, నీళ్ళు ఊరే అవకాశం ఎంతో కొంత వుంటుంది. అదే పది చోట్ల కొద్ది కొద్దిగా త్రవ్వితే ప్రయోజనం ఏమీ వుండదు.
నేహాభిక్రమ నాశో(అ)స్తి ప్రత్యవాయో న విద్యతే | స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనే గీతా శ్లోకం ద్వారా పరమాత్ముడు చెబుతాడు, ఈ ధర్మం ఎంతో కొంత ఆచరించినా సరే దాని ఫలితం ఊరికే పోదు అంటాడు.
ఆయన అలా భరోశా ఇచ్చాడు అంటే దానర్థం, మరింత వృద్ధి పరుచుకోవాలని కానీ, కొంత practice చేసి వదిలేయమని కానే కాదు. అంచేత....
స్వరూపస్థితిని పొందే దాక కూడా సాధనలో స్థిరత్వం అవసరమై వున్నది. అలా శిష్యుడు తన సాధన స్థిరంగా, ఆటంకాలు లేకుండా జరగాలి అందుకు తరుణోపాయం చెప్పమని వేడుకొనగా...
ఆ సద్గురుమూర్తి పరమ దయాళువై ఈ కీలకము ఇట్లు తెలిపిడి చేయుట జరిగెను. అందుకోగలరు. సాయిరాం.

స్వామి ! సాధన యందు స్థిరత్వం పొందటం ఎలా ?


శరీరానికి హిత , మిత ఆహారం 


ప్రాణానికి సమ స్థితిలో ప్రాణాయామం 

మనస్సుకి జపం

బుద్ధికి ధ్యానం

చిత్తానికి ఆత్మ విచారణ

అహంకార నిరసన కి వైరాగ్యం,

ఆత్మ నిష్ఠ కి తీవ్ర మోక్షేచ్చ , శరణాగతి ఇవే ఎన్ని చదివినా చేయ వలసిన జీవనం 


ఈశ్వరుని పై గురువు పై వున్న విశ్వాసం నడిపిస్తుంది 

తహ దారి చూపుతుంది 

స్వాత్మ అనుగ్రహం అనుభూతి నిస్తుంది స్వాత్మ అనుగ్రహం అంటే ఏమిటి స్వామి ?

నీ లోని అంతర్యామిని అనుసరించి జీవించటం, యిది త్రికరణ శుద్ధి వున్న వారికే!!